ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్.. ఇరాన్‌లో ధరల మోత..
ABN , Publish Date - Apr 26 , 2026 | 07:39 AM
ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యుద్ధంలో అమెరికాను ధైర్యంగానే నిలువరిస్తున్నా, అంతర్గతంగా మాత్రం దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ ప్రభావం, అంతర్గత పాలనా లోపాలు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి.
ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యుద్ధంలో అమెరికాను ధైర్యంగానే నిలువరిస్తున్నా, అంతర్గతంగా మాత్రం దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ ప్రభావం, అంతర్గత పాలనా లోపాలు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా విధించిన ఆంక్షలు, దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఆయిల్ ఎగుమతులు తగ్గిపోవడం, విదేశీ పెట్టుబడులు తగ్గడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయి (Iran economic crisis).
దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగి, ప్రజల జీవన వ్యయం భరించలేని స్థాయికి చేరుకుంది. ఇరాన్‌లో ప్రస్తుతం ఓ కోడిగుడ్డు ధర రెండు లక్షల రియాల్స్‌కు చేరుకుంది. ఒక ప్లేట్ చికెన్ కబాబ్ కోసం 50 నుంచి 60 లక్షల రియాల్స్ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరాన్‌లో ఆహార ద్రవ్యోల్బణం 112 శాతం పెరిగింది.
వంట నూనెల ధరలు 200 శాతానికి పైగా పెరిగాయి. చివరకు అంత్యక్రియల ఖర్చులు కూడా 40 శాతం పెరిగాయి. పరిశ్రమలు మందగించడం, మౌలిక వసతులు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా లోపాలు వంటి సమస్యలు ఉత్పత్తి రంగాన్ని దెబ్బతీస్తున్నాయి (Iran food inflation).
ఇక నిరుద్యోగం కూడా గణనీయంగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం.. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇరాన్‌లో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు (Iran unemployment). 1.5 కోట్ల మంది ఎలాంటి ఆదాయమూ లేకుండా అల్లాడుతున్నారు. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాలు తగ్గి రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు దాదాపు మూతపడ్డాయి. ప్రస్తుతం ఇరాన్ మార్కెట్‌లో వస్తువులు ఉన్నాయి. అయితే వాటిని కొనడానికి ప్రజల దగ్గర డబ్బులు లేవు. యుద్ధ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించలేదు సరికదా, రుణాలు కట్టడం ఆలస్యమైతే జరిమానాలు విధిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..