ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 26 , 2026 | 06:34 AM
అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారం తన డిమాండ్‌ను నిలబెట్టుకుంటోంది. భౌగోళిక, రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ప్రభావితమవుతున్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారం తన డిమాండ్‌ను నిలబెట్టుకుంటోంది. భౌగోళిక, రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ప్రభావితమవుతున్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 26) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం (Gold and Silver Rates).
ఈ రోజు (ఏప్రిల్ 26న) గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,040గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,190గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,350గా ఉంది. అలాగే చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,42,000గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి (Silver prices today). ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.7 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.6 లక్షలుగా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2.7 లక్షలు, బెంగళూరులో రూ.2.6 లక్షలుగా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..