మా ఓటమికి కారణం అదే.. పరాజయంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Apr 26 , 2026 | 10:45 AM
జైపూర్ వేదికగా శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పరాజయాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసి 228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, చివరకు పరాజయం తప్పలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
జైపూర్ వేదికగా శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పరాజయాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసి 228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, చివరకు పరాజయం తప్పలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ఓటమిపై జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఫీల్డింగ్‌లో చేసిన పొరపాట్ల వల్లే ఓడిపోయామని పరాగ్ పేర్కొన్నాడు (RR vs SRH IPL 2026).
క్యాచ్‌లు వదిలేయడం మ్యాచ్ ఫలితాన్ని మార్చిందని రియాన్ పరాగ్ అన్నాడు. ప్రత్యర్థి జట్టులో కీలక ఆటగాళ్లకు ఇచ్చిన అవకాశాలు రాజస్థాన్ ఓటమికి కారణమని పేర్కొన్నాడు. 'మా బ్యాటింగ్ బాగుంది. కానీ, మేము చాలా క్యాచ్‌లు వదిలేశాం. మంచి ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే వారు మ్యాచ్‌ను మార్చేస్తారు' అని పరాగ్ వ్యాఖ్యానించాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తాము మరిన్ని పరుగులు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో మరింత మెరుగుపడాలని పేర్కొన్నాడు (Riyan Parag reaction).
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 228 పరుగులు చేసింది (Sunrisers Hyderabad win). వైభవ్ సూర్యవంశీ (37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103) మెరుపు శతకంతో మెరిశాడు. ఛేదనలో హైదరాబాద్ 18.3 ఓవర్లలోనే 229/5 స్కోరు చేసి గెలిచింది. అభిషేక్, ఇషాన్ వేగంగా ఆడి హాఫ్ సెంచరీలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్.. ఇరాన్‌లో ధరల మోత..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..