Share News

ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించా.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి..

ABN , Publish Date - Apr 26 , 2026 | 09:34 AM

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్‌తో కొనసాగుతున్న శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను పంపిందని, దానిని తాము తిరస్కరించామని ట్రంప్ తెలిపారు.

ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించా.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి..
Trump Iran proposal

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్‌తో కొనసాగుతున్న శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను పంపిందని, దానిని తాము తిరస్కరించామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ పంపిన ఆ ప్రతిపాదన అమెరికా ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. ఇరాన్ ప్రతిపాదన మరింత మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు (Trump Iran proposal).


ఇరాన్ తాజాగా పంపిన ప్రతిపాదన గతంతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, అమెరికా ఆశించిన స్థాయిలో లేదని ట్రంప్ చెప్పారు. దీంతో ఆ ప్రతిపాదనను అంగీకరించలేమని స్పష్టం చేశారు. ఈ పరిణామం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తోంది. తమపై ఆంక్షలను, నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఇరాన్ కోరుతుండగా, అమెరికా మాత్రం వాటిని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. దీంతో ఇస్లామాబాద్‌లో జరిగాల్సిన చర్చలు రద్దయ్యాయి (Trump rejects Iran deal).


తాము అమెరికా ప్రతినిధులతో నేరుగా చర్చలు జరుపబోమని ఇరాన్‌ ప్రకటించింది (Iran nuclear issue). తమ అభిప్రాయాలను, ఆందోళనలను పాకిస్థాన్‌ ప్రతినిధులకు చేరవేస్తామని పేర్కొంది. అయితే ఇరాన్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు తమ ప్రతినిధులు జారెడ్‌ కుష్నర్‌, స్టీవ్‌ విట్‌కాఫ్‌ను పంపుతున్నట్లు అమెరికా ప్రకటించింది. కానీ, ఇరాన్ ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో అమెరికా తన ప్రతినిధులను పాక్‌కు పంపలేదు.


ఇవి కూడా చదవండి..

ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్.. ఇరాన్‌లో ధరల మోత..


ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 26 , 2026 | 09:36 AM