లుంగి ఎంగిడి గాయం తీవ్రమైనది కాదు.. క్షేమంగానే ఉన్నాడు: వేణుగోపాల్ రావు
ABN , Publish Date - Apr 26 , 2026 | 08:12 AM
ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ మైదానంలోనే కుప్పకూలిన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడికి అయిన గాయం తీవ్రమైనది కాదని వైద్యులు తెలిపారు. ఎంగిడి తలకు తగిలిన గాయం తీవ్రమైనది కాదని, అతడు క్షేమంగానే ఉన్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు తెలిపాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ మైదానంలోనే కుప్పకూలిన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడికి అయిన గాయం తీవ్రమైనది కాదని వైద్యులు తెలిపారు. ఎంగిడి తలకు తగిలిన గాయం తీవ్రమైనది కాదని, అతడు క్షేమంగానే ఉన్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు తెలిపాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఎంగిడి వెనక్కి పడిపోయాడు. అతడి తల బలంగా నేలకు తాకడంతో దెబ్బ తగిలింది (Lungi Ngidi injury).
మెడికల్ సిబ్బంది మైదానంలోకి వచ్చి అతడిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనతో మ్యాచ్ కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఎంగిడికి అయిన గాయం అంత తీవ్రమైనది కాదని తేలడంతో డీసీ ఊపిరి పీల్చుకుంది. 'ఎంగిడి ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నాడు. అతడికి అయిన గాయం తీవ్రమైనది కాదని భావిస్తున్నాం. వైద్యులు కూడా అదే చెప్పారు. అతడి ఆరోగ్యంపై మేం తదుపరి సమాచారం అందిస్తాం' అని వేణుగోపాల్ రావు తెలిపాడు (Delhi Capitals injury update).
గాయం కారణంగా ఎంగిడి బయటకు వెళ్లిపోడంతో అతని స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మరో ఆటగాడిని తీసుకోవాల్సి వచ్చింది (Ngidi health update). అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాలి. ఎంగిడి విదేశీ ఆటగాడే అయినప్పటికీ అప్పటికే ఒక ఇన్నింగ్స్ ముగియడంతో అతడి స్థానంలో ఓ స్థానిక ఆటగాడినే తీసుకున్నారు. ఎంగిడి దూరం కావడం వల్లే ఢిల్లీ జట్టు 264 పరుగుల భారీ టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిందని డీసీ అభిమానులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్.. ఇరాన్‌లో ధరల మోత..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..