భోజనం తర్వాత చేయకూడని పనులు ఇవే
ABN , Publish Date - Apr 25 , 2026 | 08:49 PM
భోజనం చేసిన వెంటనే చేసే కొన్ని చిన్న అలవాట్లు మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కూడా ఈ తప్పులు చేస్తే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. సమయానికి భోజనం చేస్తారు. అయితే మీరు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా, భోజనం చేసిన వెంటనే చేసే కొన్ని చిన్న తప్పులు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
భోజనం తర్వాత చేసే అలవాట్లు జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం తర్వాత చేయకూడని కొన్ని తప్పులు ఏమిటో తెలుసుకుందాం..
తిన్న వెంటనే నిద్రపోవడం:
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి కనీసం 30 నిమిషాల తర్వాతే నిద్రపోవడం మంచిది.
టీ లేదా కాఫీ తాగడం:
భోజనం వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరంలో ఇనుము శోషణ తగ్గుతుంది. దీని వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం తర్వాత కనీసం 45 నిమిషాల తర్వాత మాత్రమే టీ లేదా కాఫీ తాగాలి.
ఎక్కువగా నీరు తాగడం:
భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీరు తాగడం జీర్ణరసాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే భోజనం సమయంలో కొద్దిగా నీరు తాగినా సరే, వెంటనే ఎక్కువగా నీరు తాగకూడదు.
తిన్న వెంటనే స్నానం చేయడం:
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే రక్త ప్రసరణ కడుపు నుంచి చర్మానికి మళ్లుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి కనీసం ఒక గంట తర్వాతే స్నానం చేయడం మంచిది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, శరీరం కూడా ఫిట్‌గా ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News