Share News

ఎండా కాలంలో కూల్ టెక్నిక్.. ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే..

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:14 PM

మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు.

ఎండా కాలంలో కూల్ టెక్నిక్.. ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే..
viral jugaad heat

మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో చల్లదనం కోసం ఒక వ్యక్తి వేసిన అద్బుతమైన ఐడియా చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఖరీదైన ఏసీలు, కూలర్లు లేకుండానే తక్కువ ఖర్చుతో చల్లని గాలి పొందడం కోసం అతడు సూపర్ ప్లాన్ వేశాడు (Viral jugaad heat).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక స్టాండ్ ఫ్యాన్‌ కనబడుతోంది. దాని ముందు ఒక టవల్‌ను వేలాడదీశారు. ఆ టవల్ నిరంతరం తడిగా ఉండడం కోసం పైన సెలైన్ బాటిల్‌ను అమర్చారు. ఆ బాటిల్‌లోని నీరు పైప్ ద్వారా నిరంతరం టవల్‌పై పడి దానిని తడిగా ఉంచుతోంది. స్టాండ్ ఫ్యాన్ నుంచి గాలి ఆ తడి టవల్ గుండా రావడం వల్ల చల్లగా ఉంటుంది. అంటే దాదాపు కూలర్ తరహాలో ఈ ఏర్పాటు చేశారన్నమాట (Desi cooling hack).


@imTrueIndia1 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు (Summer jugaad fan). తక్కువ సమయంలోనే వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. 'ఇది ఒక దేశీ జుగాడ్. అతడు తన మెదడును సరైన చోట ఉపయోగించాడు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇది ఏసీ ఆల్ట్రా ప్రో మ్యాక్స్. చాలా తక్కువ ఖర్చుతో చల్లదనం' అని మరొకరు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్.. ఇరాన్‌లో ధరల మోత..


ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 26 , 2026 | 12:15 PM