Home » FTA
భారత్, న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు భారీ మద్దతు లభించనుంది. ముఖ్యంగా, న్యూజిలాండ్‌కు వెళ్లే భారత వస్తువులపై దిగుమతి సుంకం పూర్తిగా రద్దు చేయడం ఈ డీల్‌లో కీలక అంశం.
భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)పై సోమవారం సంతకాలు కానున్నాయి. ఈ ఒప్పందాన్ని 'తరంలో ఒక్కసారి కుదిరే ఒప్పందం' అని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ అభివర్ణించారు.
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak), భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల (Narendra Modi) భేటీ ఖరారైంది. ఇండోనేషియాలోని బాలి (Bali) వేదికగా నవంబర్‌లో జరగనున్న జీ-20 లీడర్‌షిప్ సమ్మిట్‌లో (G-20 leadership summit) ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపారు.