Share News

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:18 AM

భారత్, న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు భారీ మద్దతు లభించనుంది. ముఖ్యంగా, న్యూజిలాండ్‌కు వెళ్లే భారత వస్తువులపై దిగుమతి సుంకం పూర్తిగా రద్దు చేయడం ఈ డీల్‌లో కీలక అంశం.

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..
India New Zealand FTA

భారత్, న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు భారీ మద్దతు లభించనుంది. ముఖ్యంగా, న్యూజిలాండ్‌కు వెళ్లే భారత వస్తువులపై దిగుమతి సుంకం పూర్తిగా రద్దు చేయడం ఈ డీల్‌లో కీలక అంశం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, భారత ఉత్పత్తులు న్యూజిలాండ్ మార్కెట్లో మరింత చౌకగా లభిస్తాయి (India New Zealand FTA).


గతేడాది మార్చిలో రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలు మొదలై తొమ్మిది నెలల్లోనే పూర్తయ్యాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మెక్‌క్లే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఏడాది చివరి నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది (India NZ trade deal).


ఈ ఒప్పందం వల్ల ముఖ్యంగా వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాలు ఎక్కువగా లాభపడే అవకాశముంది. వీటికి న్యూజిలాండ్‌లో దిగుమతి సుంకం ఉండదు. గతంలో వీటిపై పది శాతం వరకు సుంకం వసూలు చేసేవారు. అంతేకాదు మనదేశంలో న్యూజిలాండ్ రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టనుంది (Zero duty exports India).


ఈ ఎఫ్‌టీఏలో ఉద్యోగాలకు కూడా ప్రాధాన్యం కల్పించారు. ఐటీ, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్ రంగాల్లో భారతీయ నిపుణులకు న్యూజిలాండ్‌లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. వీసా నిబంధనల్లో కూడా సడలింపులు కల్పించారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తాము: రష్యా అధ్యక్షుడు పుతిన్

మరో ఆయిల్‌ ట్యాంకర్‌ను టార్గెట్ చేసిన ఇరాన్

Updated Date - Apr 28 , 2026 | 07:18 AM