Share News

ఇరాన్ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తాము: రష్యా అధ్యక్షుడు పుతిన్

ABN , Publish Date - Apr 27 , 2026 | 08:29 PM

ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ సోమవారం సెయింట్ పీటర్స్ బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం అయ్యారు. ఇరాన్ ప్రయోజనాలకే తమ ప్రాధాన్యమని పుతిన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఇరాన్ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తాము: రష్యా అధ్యక్షుడు పుతిన్
Putin-Aragchi Meeting

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హామీ ఇచ్చారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సోమవారం ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఇరాన్‌తో వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని పుతిన్ ఈ సందర్భంగా మాటిచ్చారు. గత వారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పంపిన సందేశం తనకు అందిందని కూడా పుతిన్ ఈ సందర్భంగా చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇరు దేశాల నేతల మధ్య జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.


ఇదిలా ఉంటే, తమతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ మౌలిక వసతులను టార్గెట్‌ చేస్తే అంతకు నాలుగురెట్ల తీవ్రతతో తాము విరుచుకుపడతామని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ హెచ్చరించారు. తమ దేశ మౌలిక వసతులపై దాడులను యుద్ధ చర్యలుగా పరిగణిస్తామని తెలిపారు.

Updated Date - Apr 27 , 2026 | 09:52 PM