ఈ నవజాత శిశువు చేసిన పని చూస్తే.. వైరల్ వీడియో..
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:10 PM
డాక్టర్ చేతికున్న గ్లోవ్‌ను పట్టుకుని వదలని ఒక నవజాత శిశువు వీడియో వైరల్‌గా మారింది. వీడియో జనాలకు విపరీతంగా నచ్చడంతో కుప్పలుతెప్పలుగా వ్యూస్ వచ్చిపడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: చిన్న పిల్లల్లో దేవుడు ఉంటాడని అంటారు. అందుకే పసిపిల్లల్ని చూడగానే ఎవరికైనా ముఖంలో నవ్వులు పూస్తుంటాయి. ఇలాంటి ఒక నవజాత శిశువు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి చేష్టలను చూసి తెగ మురిసిపోతున్న జనాలు వీడియోను పదే పదే చూస్తూ, షేర్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తెచ్చారు.
వీడియోలో ఆ శిశువు డాక్టర్ చేతికున్న గ్లోవ్‌ను పట్టుకుని ఎంతకూ విడిచిపెట్టలేదు. డాక్టర్ తన చేతిని వెనక్కు తీసుకుందామని ప్రయత్నించినా పసిబిడ్డ వదలలేదు. చివరకు డాక్టర్ శిశువుకు చక్కిలిగింతలు పెట్టే ప్రయత్నం చేశారు. చక్కిలిగింతలకు నవ్వాల్సిన శిశువు పెద్ద పెట్టున ఏడవడంతో అక్కడున్న వారందరూ ఒకింత షాకయ్యారు.
ఇక వైరల్‌గా మారిన ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 68 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. చక్కిలిగింతలకు ఏడ్చిన చిన్నారిని చూసి కొందరు జోకులు వేశారు. ‘నవ్వు’ సాఫ్ట్‌వేర్‌ను శిశువు ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. శిశువు అంత గట్టిగా పిడికిలి బిగించడంపై మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా అది వారి శరీరతత్వమని కొందరు వివరించారు.
చేతికి తగిలిన వాటిని గట్టిగా పిడికిలి బిగించి పట్టుకోవడం శిశువుల్లో కనిపించే అసంకల్పిత చర్య అని కొందరు చెప్పారు. కడుపులో పిండానికి 16 వారాలు ఉన్నప్పుడు ఈ అసంకల్పిత చర్య మొదలవుతుందని, బిడ్డకు ఆరు నెలలు వచ్చాక పోతుందని వివరించారు. మరి ముచ్చటగొలిపే ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ వార్తలనూ చదవండి:
బద్దలైన అగ్ని పర్వతం.. భయంతో పరుగులు పెట్టిన పర్వతారోహకులు..
ఎండా కాలంలో కూల్ టెక్నిక్.. ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే..