Share News

రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి.. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ..

ABN , Publish Date - Apr 27 , 2026 | 07:21 AM

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కాబోతున్నారు. సోమవారం మాస్కోలో ఈ సమావేశం జరగనున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి.. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ..
Russia Iran relations

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కాబోతున్నారు. సోమవారం మాస్కోలో ఈ సమావేశం జరగనున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది (Putin Araghchi meeting).


పుతిన్ ఈ సమావేశానికి సిద్ధమవుతున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అయితే ఈ సమావేశం అజెండాపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. కాగా, రష్యాలోని ఇరాన్ రాయబారి కజేమ్ జలాలీ మాట్లాడుతూ.. ఈ భేటీలో అమెరికాతో తాజా చర్చల పరిస్థితి, కాల్పుల విరమణ అంశాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చలు జరగనున్నాయని చెప్పారు. అరాగ్చీ ఇప్పటికే ఇస్లామాబాద్ నుంచి రష్యాకు బయలుదేరారని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది (Vladimir Putin Iran talks).


కాగా, అమెరికా ప్రతినిధులు రాకముందే శనివారం ఇస్లామాబాద్ నుంచి ఒమన్ వెళ్లిపోయిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ తిరిగి పాకిస్థాన్ చేరుకున్నారు (Abbas Araghchi Moscow visit). అమెరికా ప్రతినిధుల పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో అరాగ్చీ తిరిగి పాక్ చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, రష్యా పర్యటనకు వెళ్లే ముందు అరాగ్చీ తిరిగి పాక్ ఎందుకు వెళ్లారనే విషయంలో పూర్తి స్పష్టత లేదు.


ఈ వార్తలనూ చదవండి:

ఈ పెద్దాయనకు భయమంటే తెలియదేమో! ట్రంప్ కార్యక్రమంలో వైరల్ సీన్

ఈ నవజాత శిశువు చేసిన పని చూస్తే.. వైరల్ వీడియో..

Updated Date - Apr 27 , 2026 | 07:34 AM