Share News

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:22 AM

అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. భౌగోళిక, రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ప్రభావితమవుతున్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు.

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price

అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. భౌగోళిక, రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ప్రభావితమవుతున్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 27) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం (Gold and Silver Rates).


ఈ రోజు (ఏప్రిల్ 27న) గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,030గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,190గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,180గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,340గా ఉంది. అలాగే చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,900గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,990గా ఉంది (Live Gold Rates).


మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,69,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,59,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,69,900గా, బెంగళూరులో రూ.2,59,900గా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలనూ చదవండి:

ఈ పెద్దాయనకు భయమంటే తెలియదేమో! ట్రంప్ కార్యక్రమంలో వైరల్ సీన్

ఈ నవజాత శిశువు చేసిన పని చూస్తే.. వైరల్ వీడియో..

Updated Date - Apr 27 , 2026 | 06:56 AM