Share News

అందుకే మేము భారత్‌కు తిరిగి రావాలని అనుకోము.. ఎన్నారై మహిళ వీడియో వైరల్

ABN , Publish Date - Apr 26 , 2026 | 08:28 PM

అమెరికాలో ఉంటున్న భారతీయులకు స్వదేశానికి తిరిగి రావాలని ఎందుకు అనిపించదో చెబుతూ ఒక ఎన్నారై మహిళ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అందుకే మేము భారత్‌కు తిరిగి రావాలని అనుకోము.. ఎన్నారై మహిళ వీడియో వైరల్
NRI Life Abroad - Viral Video

ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో ఉండే భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలని అనుకోరంటూ ఒక ఎన్నారై మహిళ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తాను స్వానుభవంతో ఈ మాటలు చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు.

‘అమెరికాకు వెళ్లిన వారు మళ్లీ తిరిగి ఎందుకు రారని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. కోట్లు సంపాదించాక కూడా వెనక్కు ఎందుకు రారని ప్రశ్నిస్తారు. నేనూ అమెరికాలోనే ఉంటున్నాను కాబట్టి మీతో ఉన్నది ఉన్నట్టు చెబుతాను. భారత్‌కు ఎందుకు తెరిగి వెళ్లరంటే ఇక్కడ గాలి కాలుష్యం తక్కువ. ఆహారం, నీరు అన్నీ నాణ్యంగా ఉంటాయి. జీవనం ప్రశాంతంగా ఉంటుంది. సౌకర్యంగా ఉంటుంది. ఇవన్నీ వదులుకుని భారత్‌కు తిరిగెళ్లడం కష్టం. జీవన ప్రమాణాల్లో చాలా తేడా ఉంటుంది. ఇక్కడ అలవాటు పడ్డాక మళ్లీ భారత్‌లోని గజిబిజి హడావుడి లైఫ్‌స్టైల్‌లో ఇమడడం కష్టం’ అని చెప్పుకొచ్చారు.


ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరు ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు. మరికొందరు మాత్రం సొంత దేశంతో ఉన్న భావోద్వేగపూరిత బంధం, మన అనే భావన మరెక్కడా ఉండదని అన్నారు. కుటుంబ బంధాలు, స్నేహితులు, ఆత్మీయత వంటివన్నీ సొంత దేశంలోనే ఉంటాయని చెప్పుకొచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

ఈ పెద్దాయనకు భయమంటే తెలియదేమో! ట్రంప్ కార్యక్రమంలో వైరల్ సీన్

ఈ నవజాత శిశువు చేసిన పని చూస్తే.. వైరల్ వీడియో..

Updated Date - Apr 26 , 2026 | 08:38 PM