Share News

పాక్ తగిన మధ్యవర్తి కాదు.. ఇరాన్ పార్లమెంట్ సభ్యుడి ఆరోపణ..

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:03 PM

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్న పాకిస్థాన్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. పాకిస్థాన్‌ను పూర్తిగా నమ్మలేమని ఇటీవల అమెరికా నాయకులు, మాజీ ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

పాక్ తగిన మధ్యవర్తి కాదు.. ఇరాన్ పార్లమెంట్ సభ్యుడి ఆరోపణ..
Iran US war news

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్న పాకిస్థాన్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. పాకిస్థాన్‌ను పూర్తిగా నమ్మలేమని ఇటీవల అమెరికా నాయకులు, మాజీ ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పాక్ తగిన మధ్యవర్తి కాదని అభిప్రాయపడ్డారు (Iran US war news).


ఇరాన్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్‌కు అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న ఇబ్రహీం రెజాయీ.. మధ్యవర్తిగా పాక్ పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. తమకు పాకిస్థాన్ మిత్ర దేశమని, అయితే ప్రస్తుతం ఆ దేశ నేతలు అమెరికా పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు (Pakistan mediator Iran US).


'పాకిస్థాన్ మనకు మంచి మిత్రదేశం. పొరుగు దేశం కూడా. కానీ అది చర్చలకు సరైన మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత దానికి లేదు. వారు ఎల్లప్పుడూ ట్రంప్ ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అమెరికన్ల కోరికలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు' అని విమర్శించారు


ఇరు దేశాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇరాన్ వైపు పాక్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని రెజాయి గుర్తు చేశారు (Ebrahim Rezaei Pakistan allegation). లెబనాన్‌పై దాడులు, ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేయడం సహా ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న పనుల గురించి పాక్ ఇప్పటివరకు ప్రశ్నించలేదన్నారు. మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలని, ఎల్లప్పుడూ ఒక పక్షం వైపు మొగ్గు చూపకూడదని అన్నారు.


ఇవి కూడా చదవండి..

రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి.. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ..


న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..

Updated Date - Apr 27 , 2026 | 12:21 PM