కాల్పుల విరమణ, హోర్ముజ్, అణు కార్యక్రమం.. అమెరికాకు ఇరాన్ మూడు దశల ప్రతిపాదన..
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:09 AM
పశ్చిమాసియాలో ఘర్షణలను తగ్గించేందుకు ఇరాన్ కొత్తగా మూడు దశల శాంతి చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ ప్రతిపాదన ఆసక్తికరంగా ఉంది.
పశ్చిమాసియాలో ఘర్షణలను తగ్గించేందుకు ఇరాన్ కొత్తగా మూడు దశల శాంతి చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ ప్రతిపాదన ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రణాళికలో యుద్ధాన్ని ముగించడం, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అణు చర్చలను తరువాత దశకు వాయిదా వేయడం వంటి కీలక అంశాలు ఉన్నాయి (Iran peace proposal).
ఈ ప్రతిపాదన ప్రకారం, మొదటి దశలో తక్షణ కాల్పుల విరమణ అమలు చేయాలని ఇరాన్ సూచించింది. దీని ద్వారా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి, చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంది. రెండో దశలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ప్రధాన లక్ష్యం. ఈ మార్గం మూసివేయడం వల్ల ప్రపంచ ఆయిల్ సరఫరాపై తీవ్రమైన ప్రభావం పడుతోంది (Strait of Hormuz reopening).
ఇక, అత్యంత వివాదాస్పదమైన అణు అంశాన్ని వెంటనే కాకుండా చివరి దశలో చర్చించాలన్నది ఇరాన్ వ్యూహం (Iran nuclear talks). ఈ అంశం అత్యంత సున్నితమైనది కావడంతో, ముందుగా శాంతి ఏర్పడిన తరువాత దీనిపై చర్చించడం మంచిదని ఇరాన్ భావిస్తోంది. దశలవారీగా సమస్యలు పరిష్కరించుకుని యుద్ధానికి చెక్ పెట్టాలనేది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. ముందు యుద్ధాన్ని ఆపి, తర్వాత కీలక సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇక, ఈ ప్రతిపాదనపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి.. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ..
న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..