ఇరాన్‌పై దాడుల్ని మరింత తీవ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా చేసే ఏ సాహసానికైనా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఇరాన్‌పై అమెరికా ప్రతీకారదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బ తీసే లక్ష్యంతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ముందుకు సాగుతోంది. నిన్న (గురువారం) సాయంత్రం హోర్ముజ్ జలసంధికి సమీపంలోని రెండు బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టుపై యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు నిర్వహించింది.
ఇరాన్‌పై మరోసారి అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ రేవులు, స్థావరాలే లక్ష్యంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ వైమానిక దాడులు చేసింది. బుధవారం బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీతో పాటు పలు తీరప్రాంత కేంద్రాలపై దాడులు జరిపింది.
హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంఘటనలు పెరగటంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది.
ఫిబ్రవరి 28న గల్ఫ్ ఉద్రిక్తతలు చెలరేగిన నాటి నుంచీ ఇప్పటివరకూ గల్ఫ్ ప్రాంతంలో 13 మంది భారతీయులు మరణించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్, అమెరికా దేశాల మధ్య జూన్ నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. తాజాగా, హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న రెండు యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడటంతో ఓ భారతీయుడు గల్లంతయ్యారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.
తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మృతిపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రతినబూనారు. ఈ మేరకు ఇరాన్ ప్రజలకు ఒక బహిరంగ సందేశాన్ని ఇచ్చారు.