ఇరాన్‌పై మరోసారి అమెరికా వైమానిక దాడులు.. 260 మందికి గాయాలు..
ABN , Publish Date - Jul 15 , 2026 | 01:07 PM
ఇరాన్‌పై మరోసారి అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ రేవులు, స్థావరాలే లక్ష్యంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ వైమానిక దాడులు చేసింది. బుధవారం బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీతో పాటు పలు తీరప్రాంత కేంద్రాలపై దాడులు జరిపింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇరాన్‌పై మరోసారి అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ రేవులు, స్థావరాలే లక్ష్యంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ వైమానిక దాడులు చేసింది. బుధవారం బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీతో పాటు పలు తీరప్రాంత కేంద్రాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో 260 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై క్రూయిజ్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తుండటంతో.. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా నిలిచిపోయింది. ట్రంప్ సర్కార్ ఇరాన్ రేవులు, ఆయిల్ టెర్మినల్స్‌పై సముద్ర దిగ్బంధాన్ని మరింత కఠినతరం చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే ఇంధన ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా - ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల సంక్షోభం నెలకొనే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హోర్ముజ్‌లో టోల్ నిర్ణయంపై వెనక్కు తగ్గిన ట్రంప్
హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించటం కోసం 20 శాతం టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గారు. టోల్ ప్రకటనను ఉపసంహరించుకున్నామని తెలిపారు. గల్ఫ్ దేశాల పెట్టుబడులతో ఖర్చు భర్తీ చేస్తామని వెల్లడించారు. వాణిజ్య ఒప్పందాలకే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి
మళ్లీ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కువైట్, జోర్డాన్‌పై ఐఆర్‌జీసీ తాజా దాడులు..
గోరింటాకు అందాలు.. ఆరోగ్యానికీ మంచిదే..