Share News

గోరింటాకు అందాలు.. ఆరోగ్యానికీ మంచిదే..

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:45 PM

ఆషాడమాసం బోనాల సంబురాలతో పాటు అతివల చేతిలో గోరింటాకు పండుతుంది. అషాడ మాసంలో అతివలు చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికీ మంచిదిగా భావిస్తారు.

గోరింటాకు అందాలు.. ఆరోగ్యానికీ మంచిదే..

  • (ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఆషాడమాసం బోనాల సంబురాలతో పాటు అతివల చేతిలో గోరింటాకు పండుతుంది. అషాడ మాసంలో అతివలు చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికీ మంచిదిగా భావిస్తారు. బుధవారం నుంచి మొదలయ్యే అషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన యువతులు గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోరింటాకు పెట్టుకొని మురిసిపోతారు. గోరింటాకు పెట్టుకోవడం అయిదోతనంగా ముత్తయిదవుల నమ్మకంగా, పెళ్లికాని అమ్మాయిలకు గోరింటా బాగా పండితే మంచి మొగుడు వస్తాడని భావిస్తారు.


srs1.2.jpgమనసంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా మహిళలు గోరింటాకుతో ఆకర్షనీయమైన డిజైన్లను వేసుకోవడానికి పోటీ పడుతారు. కొత్తగా పెళ్లైన యువతులు గోరింటాకుతో సంబరాలే జరుపుకుంటారు. డిజైన్లు వేయడానికి ప్రత్యేకంగా బ్యూటీపార్లర్‌లే వెలిశాయి. గోరింటాకు స్వయంగా తయారు చేసుకోవడాని ఇష్టపడుతారు. పల్లెల్లో లేలేత ఆకులు తెచ్చుకొని రోటిలో మెత్తగా రుబ్బుకొని చింతపండు, పెరుగు కలుపుకొని చేతులకు అందంగా చందమామ, చుక్కల నెలవంక, బందిపువ్వు, వేళ్ల చుట్టు గొడుగులు పెట్టుకుంటారు. పాదాలకు పారా ణి పెట్టుకుంటారు. పట్టణాల్లో గోరింటాకు కోన్‌లతో రకరకాల డిజైన్లను వేసుకుంటారు. పల్లెల్లో కూడా కోన్‌లను ఉపయోగిస్తున్నారు.


srs1.3.jpgగోరింటాలో ఔషధ గుణాలు..

గోరింటాకు కేవలం అందం కోసమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అతివల చేతు లు నీటిలో నానడంతో పుండ్లు, ఎలర్జీ వస్తుందని గోరింటాకు యాంటీబయాటిక్‌ లక్షణాలు ఉండడం వల్ల కాళ్లకు, చేతులకు క్రీములు దరి చేరనీయ కుండా ఉంచుతాయని తెలుస్తోంది. రక్తపోటు కూడా తగ్గిస్తుందని చెబుతారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే కాలేయ రోగాలకు, నోటి పూతను తగ్గిస్తుందని చెబుతారు. కీళ్ల నొప్పులు, వాపు కూడా గోరింటాకుతో తగ్గిపోతుందని చెబుతారు. గోరింటాకు కేవలం ఆషాడంలోనే కాకుండా పెళ్లి సంబరాల్లో కూడా ఉపయోగిస్తారు. గోరింటాకు పెట్టడానికి ప్రత్యేకమైన వ్యక్తులు కూడా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

యువతలో నైపుణ్యానికి పదును

ఆషాఢ ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 12:46 PM