Share News

మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క కీలక సమీక్ష

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:53 AM

మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క కీలక సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమావేశంలో చర్చించారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క కీలక సమీక్ష
Minister Seethakka

హైదరాబాద్, జులై 15: మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క ఈరోజు(బుధవారం) సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లు, పప్పు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు. టేక్ హోమ్ రేషన్ (THR) పంపిణీలో వేగం పెంచాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్ల చిన్నారుల హాజరును పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు.


అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. పలు పథకాల కింద బడ్జెట్ విడుదల, వ్యయంపై జిల్లాల వారీగా పనితీరును పరిశీలించారు. అంగన్వాడీ ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

ప్రశాంత్ రెడ్డి నిర్బంధం.. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం: హరీశ్ రావు

ప్రేమ వ్యవహారం.. హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 12:01 PM