Share News

ప్రశాంత్ రెడ్డి నిర్బంధం.. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం: హరీశ్ రావు

ABN , Publish Date - Jul 15 , 2026 | 09:52 AM

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరులో ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.

ప్రశాంత్ రెడ్డి నిర్బంధం.. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం: హరీశ్ రావు
Former Minister Harish Rao

హైదరాబాద్, జులై 15: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరులో ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాతో ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్న ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడం దారుణమన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమంటూ వ్యాఖ్యానించారు.


హరీశ్‌రావు పోస్ట్..

‘బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టాలని ప్రశాంత్ రెడ్డి నిర్ణయించుకుంటే.. ఆయనను పోలీసులు నిర్బంధించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం. మాది 'ప్రజా ప్రభుత్వం' అని చెప్పుకుంటూ ప్రతిపక్షాన్ని నిర్బంధించడం, పోలీసు రాజ్యాన్ని నడపడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. హిట్లర్ స్పూర్తితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులపై అణిచివేత చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి’ అని ఎక్స్‌లో హరీశ్ రావు పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం

హైదరాబాద్‌-తిరుపతి ఉదయం విమాన టికెట్లకు భారీ డిమాండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 11:08 AM