Share News

చాక్లెట్ల ఆశ చూపి బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్!

ABN , Publish Date - Jul 15 , 2026 | 09:15 AM

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్లు, బిస్కెట్ల ఆశ చూపి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

చాక్లెట్ల ఆశ చూపి బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్!
Hyderabad News

హైదరాబాద్, జులై 15: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్‌ అనే వ్యక్తి.. బాధితురాలి ఇంటి ముందు పండ్లు అమ్ముకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలోనే బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలికపై కన్నేసిన రెహాన్.. గత మే నెలలో తన ఇంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయని నమ్మించి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, జరిగిన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక భయంతో కొన్ని నెలల పాటు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది.


ఇటీవల నిందితుడు రెహాన్ మరోసారి సదరు బాలికను వేధించడం ప్రారంభించాడు. దీంతో భరించలేకపోయిన బాధితురాలు జరిగిన ఘోరాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టంతో పాటు సంబంధిత కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెహాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 09:38 AM