Share News

అస్సాంలో వరద బీభత్సం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

ABN , Publish Date - Jul 15 , 2026 | 07:59 AM

భారీ వర్షాల కారణంగా అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాటికి వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అస్సాంలో వరద బీభత్సం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
Assam floods

ఇంటర్‌నెట్ డెస్క్: భారీ వర్షాల కారణంగా అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాటికి వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి సోనిత్‌పూర్, చరిదుర్ రెవెన్యూ సర్కిల్‌కు చెందిన ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. మంగళవారం అతడి మృతదేహం లభ్యమైంది. ఇక, వరద బాధితుల సంఖ్య 35 వేలకు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. సోనిత్‌పూర్, దిబ్రూగఢ్, లఖింపూర్, ధేమాజీ, జోర్హాట్, శివసాగర్ జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. ఈ 6 జిల్లాల్లోని 99 గ్రామాలు నీట మునిగాయి.


అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపిన వివరాల మేరకు.. వరదల కారణంగా లఖింపూర్ జిల్లా అత్యంత దారుణంగా దెబ్బతింది. ఒక్క ఈ జిల్లాలోనే 35,696 మంది ప్రజలు వరద ముంపునకు గురయ్యారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గడిచిన 24 గంటల్లో సోనిత్‌పూర్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న 16 మందిని రక్షించింది. ఇక, వరదల కారణంగా 1,103.94 హెక్టార్ల వ్యవసాయ భూమి నీట మునిగింది. 16,139 జంతువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి

ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

Updated Date - Jul 15 , 2026 | 08:12 AM