ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం
ABN , Publish Date - Jul 15 , 2026 | 07:01 AM
ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఫిఫా ప్రపంచకప్-2026 తొలి సెమీఫైనల్‌లో స్పెయిన్ సునాయాస విజయం సాధించింది. బలమైన ఫ్రాన్స్ జట్టును 2-0 తేడాతో ఓడించి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఫిఫా ప్రపంచకప్-2026 తొలి సెమీఫైనల్‌లో స్పెయిన్ సునాయాస విజయం సాధించింది (Spain vs France). బలమైన ఫ్రాన్స్ జట్టును 2-0 తేడాతో ఓడించి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించి ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా ముందుకు సాగింది (FIFA World Cup 2026).
మ్యాచ్ 22వ నిమిషంలో మికెల్ ఒయార్జాబల్ గోల్ చేసి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత కూడా స్పెయిన్ దూకుడు తగ్గించకుండా వరుస దాడులు చేసింది. రెండో అర్ధభాగంలో 58వ నిమిషంలో పెడ్రో పోరో అద్భుతమైన గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఫ్రాన్స్ కూడా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా స్పెయిన్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది (Spain reaches final).
ఈ విజయంతో స్పెయిన్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీస్-2 (అర్జెంటీనాXఇంగ్లండ్) విజేతతో ఫైనల్‌లో తలపడనుంది (France vs Spain semifinal). ఈ టోర్నీలో కేప్ వర్డేతో (0-0) డ్రా మినహా మిగతా ఆరింటిలోనూ స్పెయిన్ విజయాలు నమోదు చేసింది. వాటిల్లో ఐదు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టును ఒక్క గోల్ కూడా చేయనివ్వకపోవడం విశేషం. కాగా, ఫిఫా ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం స్పెయిన్‌కు ఇది రెండోసారి. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఒంటికి నిప్పంటించుకుని రోడ్డుపైకి..
నియంత్రణలో ఖర్చులు తగ్గిన మూలధన వ్యయం