Home » Nizamababad
ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు యువకులు అక్కడి సైనికుల చేతిలో చిక్కుకున్ని ఇబ్బందులకు గురవడం కలకలం రేపుతోంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో భూమి కోల్పోయిన ఓ మహిళకు 20 ఏళ్లయినా ప్రత్యామ్నాయ భూమి అప్పగించకపోవడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల పాటు వ్యవసాయ ఆదాయం కోల్పోయిన ఆమెకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం కొట్టేయడానికి నిరాకరించింది.
తెలంగాణలో పిడుగులు, భారీ వర్షాల కారణంగా ఓ విద్యార్థి మృతి చెందగా ఇద్దరు రైతులు గాయపడ్డారు. పలు జిల్లాల్లో పశువులు మృత్యువాతపడగా, మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. రిజర్వ్ ఎస్సై సతీశ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనతో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నక్క సుశీలరాణి మంగళవారం నిజామాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
యాసిడ్ దాడి జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మరణించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో చోటు చేసుకుంది.
బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడిందని తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పదేళ్లలో దోచుకున్న డబ్బులను ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ లెక్కపెడుతున్నారని అన్నారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పెద్ద కొడుకుగా ప్రశాంత్ రెడ్డి చెప్పుకుంటారని.. కానీ, మహాభారతంలో శకుని వంటి వ్యక్తి ఆయనని మండిపడ్డారు.
హెల్మెట్లు లేని వాహనదారులకు ఎప్పుడూ చలాన్లు వేసే ట్రాఫిక్ పోలీసులు.. నేడు వినూత్న విధానాన్ని ఎంచుకున్నారు. నేడు రక్షాబంధన్ సందర్భంగా ప్రేమతో రాఖీలు కట్టారు.