Share News

Nizamabad Firing: రోడ్డుపై లారీ డ్రైవర్ల ఘర్షణ.. కాల్పుల్లో ఒక డ్రైవర్ మృతి

ABN , Publish Date - Dec 16 , 2025 | 09:51 PM

రోడ్డుపై లారీ డ్రైవర్ల మధ్య నెలకొన్న ఘర్షణ ఒక డ్రైవర్ ప్రాణాన్ని బలిగొంది. మరో లారీ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎదుటి లారీ డ్రైవర్ పై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది.

Nizamabad Firing: రోడ్డుపై లారీ డ్రైవర్ల ఘర్షణ.. కాల్పుల్లో ఒక డ్రైవర్ మృతి
Nizamabad Firing

నిజామాబాద్, డిసెంబర్ 16: నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలంలోని దేవీతండా సమీపంలో జాతీయ రహదారి 44 పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి, మహమ్మద్ సల్మాన్ (48) అనే డ్రైవర్‌ను హతమార్చారు.


తాజా సమాచారం ప్రకారం, సల్మాన్ తన లారీని పెట్రోల్ బంక్ వద్ద నిలిపి ఉంచిన సమయంలో మరో లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన సల్మాన్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందాడు.


దుండగులు తమ లారీని చంద్రాయన్‌పల్లి వరకు తీసుకెళ్లి అక్కడ వదిలివేసినట్టు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు జరుపుతున్నారు. లారీ డ్రైవర్ల మధ్య ఘర్షణ ఇంత అనర్థానికి దారితీయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ సాయంత్రానికి డ్రామా మొదలైంది: సీఎం చంద్రబాబు

తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్

For More TG News And Telugu News

Updated Date - Dec 16 , 2025 | 10:02 PM