Aadi Srinivas: తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:53 PM
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. మూడు దశల్లో జరుగుతున్నాయి. రేపటితో అంటే డిసెంబర్ 17వ తేదీ మూడో దశతో ఈ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
హైదరాబాద్, డిసెంబర్16: బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరోసారి నిప్పులు చెరిగారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చినా చేసేదేమీ లేదన్నారు. కేటీఆర్ పాదయత్ర చేసి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పదేండ్లలో చేయనిది సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లలో చేశారని.. పాదయాత్ర చేస్తే కేటీఆర్‌కు ఈ విషయం అర్థమవుతుందన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫారం ఇచ్చినా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారంటూ సందేహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తొలిసారి 171 ఓట్ల మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారని.. కానీ తాను మొదటి సారి 14,561 ఓట్లతో విజయం సాధించానని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. తండ్రి చాటు బిడ్డగా కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.
తాను కష్టపడి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అయితే కేసీఆర్ మనవడు అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారని.. కానీ రేవంత్ మనవడు ప్రయివేట్ కార్యక్రమానికి వచ్చారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వివరించారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. మూడు దశల్లో జరుగుతున్నాయి. రేపటితో అంటే డిసెంబర్ 17వ తేదీ మూడో దశతో ఈ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. అయితే రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాలను గెలుచుకుంది. ఈ ఫలితాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
మరోవైపు డిసెంబర్ 19వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలని హామీలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అంశం, తెలంగాణలో ప్రాజెక్ట్ అంశాలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నట్లు కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కేటీఆర్ చేపట్టే ఈ యాత్ర వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరదంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్న విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కోటి సంతకాల సేకరణ నాటకం.. బూటకం
రూ.2.40లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి.. తండ్రికి తెలియడంతో..
For More TG News And Telugu News