Child Trafficking: రూ.2.40లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి.. తండ్రికి తెలియడంతో..
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:03 PM
శిశువును భారీ నగదుకు తల్లి విక్రయించింది. ఈ విషయం తెలిసి.. కన్న తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ విషయం బహిర్గమైంది. ఈ వ్యవహారంలో నలుగురు మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిజామాబాద్, డిసెంబర్ 16: శిశు విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు పలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ విక్రయాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మ గుట్టలో శిశు విక్రయం జరిగింది. పోలీసులకు ఆ శిశువు కన్న తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. నలుగురు మధ్యవర్తులను అరెస్ట్ చేశారు.
అలాగే ఆ శిశువు కన్న తల్లిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని.. విచారించారు. మహారాష్ట్రలోని పుణేకు చెందిన విశాల్‌కు రూ. 2.40 లక్షలకు శిశువును విక్రయించినట్లు పోలీసులకు ఆ కన్న తల్లి వెల్లడించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ శిశువును తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు.. పోలీసులు పుణే బయలుదేరి వెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కోటి సంతకాల సేకరణ నాటకం.. బూటకం
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
For More AP News And Telugu News