నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ హల్‌చల్
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:43 PM
నిజామాబాద్‌లో పోలీసులకు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థిని బయటకు పంపారంటూ ఎంపీకి కార్యకర్తలు సమాచారమిచ్చారు. వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ.. అక్కడి ఎన్నికల సిబ్బంది, పోలీసులపై ఫైర్ అయ్యారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 11: నిజామాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) హల్‌చల్ చేశారు. హరిచరణ్ మార్వాడీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై అర్వింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపేశారని, ఎన్నికల సిబ్బంది తమకు సహకరించడం లేదని ఎంపీకి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ.. పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘తన్నులు తింటారు.. సంగతి చూస్తాను’ అని పోలీసులను ఉద్దేశించి హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం పంపిన ఎంపీ అర్వింద్.. బీజేపీ అభ్యర్థిని బయటకు పంపిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. మరికాసేపట్లో ముగియనుంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
Read Latest Telangana News And Telugu News