జగన్ హయాంలో ఇసుక అక్రమాల కేసు.. ఈడీ ముందుకు కీలక సాక్షి
ABN , Publish Date - Jul 15 , 2026 | 10:37 AM
జగన్ హయాంలో ఏపీలో జరిగిన ఇసుక తవ్వకాల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. మూడు ప్రముఖ సంస్థలపై అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.
న్యూఢిల్లీ, జులై 15: జగన్ హయాంలో ఏపీలో జరిగిన ఇసుక తవ్వకాల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది. మూడు ప్రముఖ సంస్థలపై అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణల నేపథ్యంలో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. కీలక సాక్షి దండా నాగేంద్ర కుమార్‌కు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 50 కింద అసిస్టెంట్ డైరెక్టర్ గజరాజ్ సింగ్ ఠాకూర్ నోటీసులు జారీ చేశారు. నేడు(బుధవారం) హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో నాగేంద్ర కుమార్ వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్‌జీటీ(NGT), సుప్రీంకోర్టులలో గత జగన్ ప్రభుత్వంపై అమరావతికి చెందిన దండా నాగేంద్ర కుమార్ కేసులు వేశారు. దీంతో ఆయనను ఈడీ కీలక సాక్షిగా పరిగణిస్తోంది. నాగేంద్ర కుమార్ ఆరోపణలతో ప్రతిమ ఇన్‌ఫ్రా, జైప్రకాష్ పవర్ వెంచర్స్, జీసీకేసీ(GCKC) ప్రాజెక్ట్స్ సంస్థలపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. సదరు సంస్థల అక్రమ ఇసుక మైనింగ్ ఆపరేషన్లపై నాగేంద్రను ఈడీ అధికారులు సాక్ష్యాధారాలు కోరారు. ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ నకళ్లతో పాటు మైనింగ్ ఆధారాలు సమర్పించాలని స్పష్టీకరించారు. సెక్షన్ 50(2), 50(3) కింద ఈ విచారణను న్యాయపరమైన ప్రక్రియగా ఈడీ అధికారులు పరిగణించనున్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్-తిరుపతి ఉదయం విమాన టికెట్లకు భారీ డిమాండ్
ప్రశాంత్ రెడ్డి నిర్బంధం.. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం: హరీశ్ రావు
Read Latest AP News And Telugu News