Share News

యువతలో నైపుణ్యానికి పదును

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:29 AM

ప్రతి సంవత్సరం జూలై 15వ తేదిన ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ యూత్‌ స్కిల్స్‌ డేను ఘనంగా జరుపుకుంటోంది.

 యువతలో నైపుణ్యానికి పదును
World Youth Skills Day

  • నేడు ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం

వేములవాడ(రాజన్న సిరిసిల్ల): ప్రతి సంవత్సరం జూలై 15వ తేదిన ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ యూత్‌ స్కిల్స్‌ డేను ఘనంగా జరుపుకుంటోంది. యువతకు సాంకేతిక, వృత్తి నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం డిగ్రీ చదువు ఒక్కటే చాలదని, ఇండస్ర్టీకి కావాల్సిన నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగంలో రాణించవచ్చని, స్వయం ఉపాధి, సొంతంగా వ్యాపారం, స్టార్టప్‌ పెట్టుకోవడానికి, డిజిటల్‌ యుగంలో ఏఐ, కోడింగ్‌, డిజిటల్‌ మార్కె టింగ్‌ వంటి కొత్త రంగాల్లో యువతను సిద్ధం చేయడం, గ్రామీణ యువతకు వ్యవసాయం, చేనేత, కుటీర పరిశ్రమల్లో ఆధునిక నైపుణ్యాలు నేర్పడమే లక్ష్యంగా యువజన నైపుణ్య దినోత్సవాన్ని చేపడుతుంటారు.


ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం రోజున భారత ప్రభుత్వం స్కిల్‌ ఇండియా మిషన్‌ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉచిత శిక్షణ శిబిరాలు, జాబ్‌ మేళాలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో తెలంగాణ అకాడ మి ఫర్‌ స్కిల్‌, నాలెడ్జ్‌ ఆధ్వర్యంలో కాలేజీల్లో ఉచిత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వం అందించే స్కిల్‌ ఇండియా మిషన్‌ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయస్సు, కనీసం 8వ తరగతి చదివిన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తుంది.

స్కిల్‌ ఇండియా మిషన్‌ లక్ష్యం...

భారత ప్రభుత్వం స్కిల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా కౌశల్‌ భారత్‌-కుశల్‌ భారత్‌ పేరుతో సమర్థవంతమైన భారత్‌ను నిర్మించేందుకు యు వతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్ణ యించింది. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో 15జూలై 2015లో అట్టహాసంగా ప్రారంభించారు. భవిష్యత్తులో భారత యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారిని ఉపాధికి సిద్ధం చేయడమే లక్ష్యంగా కొన్ని పథకాలను, కార్యక్రమాలను రూపొందించింది. అందులో ప్రధాన పథకాల వివరాలు..

1) పీఎంకేవీవై (ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకం) ద్వారా 10, 12వ తరగతలు, పాస్‌, ఫెయిల్‌ అయిన యువతకు 4 నుంచి

24వారాల ఉచిత శిక్షణ, సర్టిఫికెట్స్‌, ప్లేస్‌మెంట్‌ కల్పించేందుకు అవకాశాలు కల్పించారు.

2) డీజీటీ, ఐటీఐ పథకంలో 8వ తరగతి పాస్‌ అయిన యువతకు 138 రంగాల్లో 2 సంవత్సరాల

డిప్లొమా కోర్సుల్లో శిక్షణ.

3) జేఎస్‌ఎస్‌-జన్‌ శిక్షణ్‌ సంస్థాన్‌ ద్వారా గ్రామీణ, పట్టణ పేదలకు టైలరింగ్‌, మొబైల్‌ రిపెయిర్‌, బ్యూటీ వంటి 3 నుంచి 6 నెలల కోర్సులు.

4) ఎన్‌ఏపీఎస్‌- నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ప్రమోషన్‌ ద్వారా ఆయా కంపెనీల్లో ఆన్‌ జాబ్‌ ట్రై నింగ్‌ చేస్తున్న వారికి శిక్షణతో పాటు స్టైఫండ్‌

కూడా అందిస్తారు.

5) పీఎం విశ్వకర్మ ద్వారా కమ్మరి, వడ్రంగి వంటి 18 వృత్తుల వారికి ఉచిత టూల్స్‌, శిక్షణలో రూ. 15 వేలతో పాటు లోన్‌ సౌకర్యం.

శిక్షణ ఇచ్చే ప్రధాన రంగాలు..

ఐటీ, డిజిటల్‌ రంగాల్లో ముఖ్యంగా ఏఐ, డాటా ఎంట్రీ, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ మార్కెటింగ్‌, ట్యాలీ శిక్షణ ఇవ్వనుండగా మ్యాన్‌ ఫ్యాక్ష రింగ్‌ కంపనీల్లో ఈవీ మెకానిక్‌, డ్రోన్‌ ఆపరేటర్‌, వెల్డింగ్‌, సీఎన్‌ సీకి సంబంధించి శిక్షణలు ఉన్నాయి. హెల్త్‌కేర్‌ విభాగంలో జీఎన్‌ఎం, ఏఎన్‌ఎమ్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌, జెరియాట్రిక్‌ కేర్‌ శిక్షణ అవకాశాలు ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లోని యువతకు మేషన్‌, ప్లాంబర్‌, ఎలక్ర్టిషియన్‌, హెచ్‌వీ ఏసీల్లో శిక్షణ ఉంటుంది. రిటెయిల్‌, హాస్పిటాలిటీ విభాగంలో బీపీవో, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, సెల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. అగ్రీ, రూరల్‌ రంగాల్లో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డైయిరీకి సంబంధించిన శిక్షణలు కల్పించే అవకాశాలు ఉన్నాయి.

యువతకు లాభాలు..

భారత ప్రభుత్వం స్కిల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా ఆయా రంగాల్లో యవతకు అందించే శిక్షణ పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ఫీజు, యూనిఫామ్‌, స్టడీ మెటీరియల్స్‌ కూడా పూర్తి ఉచితంగా అందిస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఎన్‌ఎస్‌డీసీ సర్టిఫికెట్‌ అందజేస్తుంది. శిక్షణ పూర్తి అయిన తరువాత ఆయా కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌కు కృషి చేస్తుంది. ముద్రయోజన కింద రూ.10 లక్షల వరకు స్టార్టప్‌ లోన్‌ అందిస్తుంది.


vmd1.2.jpgదరఖాస్తు చేసుకోవడం ఎలా..

స్కిల్‌ఇండియాడిజిటల్‌.గౌట్‌.ఇన్‌ ఫోర్టల్‌ వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిష్టర్‌ లేదా లాగిన్‌ ఆప్షన్‌తో లాగిన్‌ అవగానే మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేయగానే లాగిన్‌ అవ్వచ్చు. తరవాత ఫైండ్‌ ఏ ట్రైనింగ్‌ సెంటర్‌పై క్లిక్‌ చేయగానే జిల్లా, రాష్ట్రం, సంబంధించిన కోర్సు పేరు సెలెక్ట్‌ చేసుకోవాలి. తరువాత ఎన్రోల్‌ నవ్‌ నొక్కాలి. తదనంతరం ఆధార్‌, చదవు సర్టిఫికెట్స్‌ ఆప్‌లోడ్‌ చేస్తే ఆప్లికేషన్‌ పూర్తి అవుతుంది. అంతేకాకుండా మరో మార్గంలో కూడా దరఖాస్తు చేయవచ్చు.


స్కిల్‌ ఇండియా డిజిటల్‌ యాప్‌ను ప్లే స్టోర్‌, ఆప్‌ స్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అయ్యాక ఎక్స్‌ప్లోర్‌ కోర్సేస్‌లో 800 పైగా కోర్సులుంటాయి, కోర్సులు సెలెక్ట్‌ చేసి ఆప్లై చేస్తే ఆయా సెంటర్‌ నిర్వాహకులు కాల్‌ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల వారికి బెస్ట్‌ ఆప్షన్‌గా దగ్గరలో ఉన్న ఐటీఐ పీఎమ్‌కేవీవై ట్రైనింగ్‌ సెంటర్‌, జన్‌ శిక్షణ్‌ సంస్థాన్‌కి వెళ్లి నేరుగా దరఖాస్తు ఫారమ్‌ అందజేయవచ్చు. పదో తరగతి మార్క్స్‌ మెమో, 2 పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోస్‌ తీసుకువెళ్లడం తప్పనిసరి. ఈ దరఖాస్తులకు భారత ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా చేపడుతుంది. ఒకవేళ ఫీజు అడిగితే అది ఫేక్‌ సెంటర్‌గా భావించాలని అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైదరాబాద్‌-తిరుపతి ఉదయం విమాన టికెట్లకు భారీ డిమాండ్

ఆషాఢ ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 11:29 AM