ఆషాఢ ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Jul 15 , 2026 | 09:13 AM
ఆషాఢ ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల24, 25తేదీల్లో ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: ఆషాఢ ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల24, 25తేదీల్లో ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జోన్ పరిధిలోని నాగర్‌సోల్-పండరీపూర్, పండరీపూర్-జాల్నా, అదిలాబాద్-మిరాజ్, అకోలా- పండరీపూర్ మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
అలాగే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి-దానాపూర్-చర్లపల్లి మార్గంలో ఈ నెల 18 నుంచి 27వరకు 4 ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్-గోరఖ్‌పూర్-హైదరాబాద్ మార్గంలో ఆగస్టు 7నుంచి 30వరకు 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్-తిరుపతి ఉదయం విమాన టికెట్లకు భారీ డిమాండ్
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News