మళ్లీ దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక
ABN , Publish Date - Jul 15 , 2026 | 08:24 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తులో ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌పై ఎలాంటి దాడి జరిగినా, దానికి అత్యంత కఠినమైన సైనిక ప్రతిస్పందన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, దేశాన్ని రక్షించేందుకు అవసరమైన ప్రతి చర్యా తీసుకుంటామని తెలిపారు (Benjamin Netanyahu Warning).
దక్షిణ నగరమైన డిమోనాలో జరిగిన నెగెవ్ సదస్సులో బెంజమిన్ మాట్లాడారు. 'మేము ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉన్నాము. నేను మీకు ఒక్కటే చెప్పగలను, ఇరాన్ నాయకులకు కూడా ఇదే చెబుతాను. మీరు మాపై దాడి చేస్తే మేము శాంతంగా ఉంటామని ఆశించవద్దు' అని పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, క్షిపణి దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై మరోసారి దాడి చేయాలనే ఆలోచన కూడా చేయొద్దని ఆయన హెచ్చరించారు (Iran Israel conflict).
ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి సామర్థ్యాలపై ఇజ్రాయెల్‌కు చాలా కాలంగా ఆందోళనలు ఉన్నాయి (Israel retaliation). ఈ నేపథ్యంలో అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని నెతన్యాహు పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్‌కు ఎదురయ్యే ప్రతి ముప్పును సమర్థంగా తిప్పికొడతామని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం