Home » Benjamin Netanyahu
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని పేర్కొన్నారు.
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. నెతన్యాహు ఓ యుద్ధ నేరస్థుడని, అతడు న్యూయార్క్‌కు వస్తే కచ్చితంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తామని మమ్దానీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటికీ, ఆయనను అరెస్ట్ చేసే చట్టపరమైన అధికారం తనకు లేదని న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
ఇజ్రాయెల్‌కు ఉన్న ఏకైక మిత్రదేశం అమెరికా మాత్రమేనని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కౌంటర్ ఇచ్చారు.
ఇరాన్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్వీర్యం చేసే అవకాశముందని అమెరికా ఇంటెల్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ఆయనో యోధుడని ఇజ్రాయెల్ ప్రధాని మంత్రిని ప్రశంసించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో వ్యవహారం చాలా కష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. డీల్‌కు కొన్ని గంటల ముందు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ముప్పు తలెత్తిందని అన్నారు. ఆ తరువాత తేరుకుని డీల్ కుదుర్చుకునేందుకు కొంత సమయం కూడా పట్టిందని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా ఇరాన్ విషయంలో గంట పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ట్రంప్ వ్యూహంపై నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటనకు గాను ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారంనాడు ఒక సదస్సులో విషయాన్ని వెల్లడించారు.
హమాస్ సంధికి ఒప్పుకుందని చెప్పేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూకు ఫోన్ చేసిన ట్రంప్ ఆయనపై మండిపడ్డారు. నేతన్యాహూ నిరాసక్తంగా వ్యవహరించడంతో ఆయనది ఎప్పుడూ వ్యతిరేక ధోరణే అంటూ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.