Share News

భారత్‌ను ప్రధాని మోదీ గ్లోబల్ పవర్‌గా మార్చారు.. ఇజ్రాయెల్ ప్రధాని కితాబు

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:48 PM

ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో భారతదేశం 'వరల్డ్ పవర్‌'‌గా రూపాంతరం చెందిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొనియాడారు. మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా నెతన్యాహు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

భారత్‌ను ప్రధాని మోదీ గ్లోబల్ పవర్‌గా మార్చారు..  ఇజ్రాయెల్ ప్రధాని కితాబు
Netanyahu Wishes PM Modi on 76th Birthday, Calls India a World Power

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 17: భారత ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మోదీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం 'X' ద్వారా ఇరు దేశాల నాయకుల ఫొటోను పంచుకుంటూ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.


'గ్లోబల్ పవర్'గా భారతదేశం: ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో భారతదేశం 'వరల్డ్ పవర్‌'‌గా రూపాంతరం చెందిందని నెతన్యాహు కొనియాడారు. భారత్-ఇజ్రాయెల్ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఇదివరకూ ఎన్నడూ లేని విధంగా బలమైన, అపూర్వమైన భాగస్వామ్యం ఏర్పడిందని చెప్పారు. ఇరు దేశాల మధ్య మైత్రి గతంలో కంటే ఇప్పుడు చాలా బలంగా ఉందని, భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఆరోగ్యవంతమైన, సుదీర్ఘమైన నాయకత్వ జీవితం లభించాలని ఇజ్రాయెల్ ప్రధాని ఆకాంక్షించారు.


ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు అగ్రనేతలు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 06:34 PM