ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Sep 17 , 2026 | 10:20 AM
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్థివదేహాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులర్పించారు. ఆళ్ల నాని అకాలమరణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఏలూరు జిల్లా, సెప్టెంబర్ 17: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్థివదేహాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులర్పించారు. ఆళ్ల నాని అకాలమరణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆళ్ల నాని మృతి చాలా బాధాకరమన్నారు. రాజకీయాల్లో చాలా హుందాగా వ్యవహరించారని తెలిపారు. వ్యక్తిగత విమర్శలకు ఏనాడూ తావివ్వలేదని.. సమస్యలపై మాత్రమే పోరాటం చేశారని అన్నారు. టీడీపీ భావజాలానికి ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్లు అప్పట్లో తెలిపారన్నారు. ఆయన కుటుంబానికి పార్టీపరంగా, ప్రభుత్వపరంగా అండగా ఉంటామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
లోకేశ్‌తో పాటు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, రోషన్ కుమార్, పలువురు కూటమి నాయకులు.. ఆళ్ల నాని భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి..
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ.. ప్రెస్‌నోట్ విడుదల చేసిన ఏసీబీ
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
Read Latest AP News And Telugu News