నేరస్థలానికే ఫోరెన్సిక్ ల్యాబ్
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:54 AM
నేరస్థలానికే ఫోరెన్సిక్ ల్యాబ్ 26 జిల్లాలకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలు కేసుల పరిష్కారంలో మరింత వేగం: డీజీపీ గుప్తా అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నేర పరిశోధనలను వేగవంతం చేయడానికి, ఘటనా స్థలంలోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించడానికి రాష్ట్రంలో అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలను ప్రారంభించామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ వాహనాలు నేరం జరిగిన స్థలానికి చేరుకుని.. కీలక ఆధారాలు గుర్తిస్తాయని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్ఎల్) డైరెక్టర్ పీహెచ్‌డీ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో... అత్యాధునిక కిట్లు, సైబర్ ఫోరెన్సిక్ పరికరాలతో సిద్ధం చేసిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలను పోలీసు శాఖ డీజీపీ చేతుల మీదుగా 26 జిల్లాలకు అందజేసింది. ఈ సందర్భంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు నేరం జరిగినా క్రైమ్ స్పాట్‌కు వేగంగా చేరుకోవడానికి 107 క్రైమ్ స్పాట్ వాహనాలు సబ్ డివిజన్లలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఏడేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే నేరాలు జరిగినప్పుడు అత్యాధునిక పరికరాలతో కూడిన మొబైల్ వాహనాలను పంపి సూక్ష్మ ఆధారాలు సేకరించేందుకు జిల్లాకు ఒకటి చొప్పున కేటాయించినట్లు తెలిపారు. రక్తం, వేలిముద్రలు, గన్‌షాట్ అవశేషాలను గుర్తించే కిట్లు.. సంచలన, సంక్లిష్ట కేసుల్లో నిక్కచ్చి ఆధారాలు సేకరించే సాధనాలు, ఎఫ్‌ఎస్ఎల్ బృందాలు ఈ వాహనాల్లో ఉంటాయని వివరించారు. నేరాలు జరిగినప్పుడు శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరించి శిక్షల శాతం మరింత పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ కేసుల పరిష్కారంలో ఏపీ ఎఫ్‌ఎ్‌సఎల్ 92.5 శాతంతో దేశంలోనే రెండో స్థానం (92.7 శాతంతో కర్ణాటక తొలి స్థానం)లో ఉన్నట్లు వెల్లడించారు. Mobile Forensic Vehicles Launched in 26 AP Districts
26 జిల్లాలకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలు
కేసుల పరిష్కారంలో మరింత వేగం: డీజీపీ గుప్తా
అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నేర పరిశోధనలను వేగవంతం చేయడానికి, ఘటనా స్థలంలోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించడానికి రాష్ట్రంలో అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలను ప్రారంభించామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ వాహనాలు నేరం జరిగిన స్థలానికి చేరుకుని.. కీలక ఆధారాలు గుర్తిస్తాయని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్ఎల్) డైరెక్టర్ పీహెచ్‌డీ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో... అత్యాధునిక కిట్లు, సైబర్ ఫోరెన్సిక్ పరికరాలతో సిద్ధం చేసిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలను పోలీసు శాఖ డీజీపీ చేతుల మీదుగా 26 జిల్లాలకు అందజేసింది. ఈ సందర్భంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు నేరం జరిగినా క్రైమ్ స్పాట్‌కు వేగంగా చేరుకోవడానికి 107 క్రైమ్ స్పాట్ వాహనాలు సబ్ డివిజన్లలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఏడేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే నేరాలు జరిగినప్పుడు అత్యాధునిక పరికరాలతో కూడిన మొబైల్ వాహనాలను పంపి సూక్ష్మ ఆధారాలు సేకరించేందుకు జిల్లాకు ఒకటి చొప్పున కేటాయించినట్లు తెలిపారు. రక్తం, వేలిముద్రలు, గన్‌షాట్ అవశేషాలను గుర్తించే కిట్లు.. సంచలన, సంక్లిష్ట కేసుల్లో నిక్కచ్చి ఆధారాలు సేకరించే సాధనాలు, ఎఫ్‌ఎస్ఎల్ బృందాలు ఈ వాహనాల్లో ఉంటాయని వివరించారు. నేరాలు జరిగినప్పుడు శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరించి శిక్షల శాతం మరింత పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ కేసుల పరిష్కారంలో ఏపీ ఎఫ్‌ఎ్‌సఎల్ 92.5 శాతంతో దేశంలోనే రెండో స్థానం (92.7 శాతంతో కర్ణాటక తొలి స్థానం)లో ఉన్నట్లు వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య