ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 16 , 2026 | 09:16 PM
ఏపీలోని నంద్యాల జిల్లాలో వినాయక నిమజ్జనం వేళ విషాదం చోటుచేసుకుంది. గణేశ్ లడ్డూ వేలం నేపథ్యంలో తలెత్తిన గొడవ కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
నంద్యాల, సెప్టెంబర్ 16: వినాయక నిమజ్జనం వేళ అపశ్రుతి నెలకొంది. లడ్డూ వేలం నేపథ్యంలో జరిగిన వివాదం కారణంగా మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ఎర్రమఠంలో వినాయక నిమజ్జనం సందర్భంగా.. లడ్డూని వేలం వేశారు. స్థానిక నివాసి ఒకరు లడ్డూని రూ. 38 వేలకు దక్కించుకున్నారు. సొంతం చేసుకున్న లడ్డూని ఇంటికి తీసుకెళ్లగా.. ఎక్కువ మొత్తానికి వేలం పాట పాడినందుకు ఇంట్లో వివాదం తలెత్తింది. మాటామాటా పెరగడంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి.. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు