భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Sep 16 , 2026 | 08:09 PM
ప్రముఖ కన్నడ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మభూషణ్ అనంత్ నాగ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 16: ప్రముఖ కన్నడ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మభూషణ్ అనంత్ నాగ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఐదు దశాబ్దాలుగా భారతీయ సినిమాకు అనంత్ నాగ్ చేసిన అసాధారణమైన సేవ నిజంగా అద్భుతమైనదని పవన్ కొనియాడారు. ఆయన ప్రతిభ, అంకితభావం తరతరాలకు స్ఫూర్తినిచ్చాయన్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన అమూల్యమైన సేవకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం ద్వారా భారత ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చిందన్నారు. అనంత్ నాగ్ మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలతో నిండునూరేళ్లు జీవించాలని.. మరెన్నో చిరస్మరణీయమైన ప్రదర్శనలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కోరుకున్నారు.
Also Read:
9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు
కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్