9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:40 PM
తన యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ రాకపోవడంతో విసిగిపోయిన ఓ 9 ఏళ్ల బాలుడు తన తండ్రి క్రెడిట్ కార్డుతో ఏకంగా రూ.1.13 కోట్ల పెట్టి ప్రకటనలు ఇచ్చాడు. విషయం తెలిసి ఆ తండ్రికి దిమ్మతిరిగినంత పనైంది.
ఇంటర్నెట్ డెస్క్: తన యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ రాకపోవడంతో విసిగిపోయిన ఓ 9 ఏళ్ల బాలుడు తన తండ్రి క్రెడిట్ కార్డుతో ఏకంగా రూ.1.13 కోట్ల పెట్టి ప్రకటనలు ఇచ్చాడు. విషయం తెలిసి ఆ తండ్రికి దిమ్మతిరిగినంత పనైంది. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, మైక్ అనే బాలుడికి యూట్యూబ్ ఛానల్ ఉంది. మైన్‌క్రాఫ్ట్, రాబ్‌లాక్స్ గేమ్‌ప్లే వంటి ఆటల వీడియోలను తన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. కానీ కష్టానికి తగిన ప్రతిఫలం రాక, వ్యూస్ లేక బాలుడు చింతిస్తుండేవాడు. విషయం తెలిసిన తండ్రి డేవ్ ఒక రోజు తన కొడుకుకి అతడి ఛానల్ ప్రమోషన్ కోసం యూట్యూబ్‌లో యాడ్ క్యాంపెయిన్ ఎలా నిర్వహించాలో చూపించాడు. క్రెడిట్ కార్డును ఉపయోగించి ఓ యాడ్ క్యాంపెయిన్ ఎలా నిర్వహించాలో సోదాహరణంగా చేసి చూపించాడు.
ఇదంతా చూసిన బాలుడు వ్యూస్ కోసం యాడ్ క్యాంపెయిన్ శరణ్యమని భావించాడు. ఇష్టారీతిన తండ్రి క్రెడిట్ కార్డు వాడేసి యాడ్ క్యాంపెయిన్లు నిర్వహించాడు. మూడు వారాల్లోనే యాడ్‌లపై రూ.1.13 కోట్లు ఖర్చుపెట్టేశాడు. డేవ్‌కు క్రెడిట్ కార్డును అతడు పని చేస్తున్న కంపెనీ వారు ఇచ్చారు. ఓ రోజు కంపెనీ వారు డేవ్‌ను ఆఫీసుకు పిలిచి అతడి ముందు క్రెడిట్ కార్డు బిల్లు పెట్టారు. కట్టాల్సిన మొత్తం చూసేసరికి డేవ్‌కు దిమ్మతిరిగినంత పనైంది. తన కొడుకు ఏం చేశాడో అప్పటికి గానీ డేవ్‌కు తెలియలేదు. ప్రస్తుతం తన లైఫ్ సస్పెన్స్‌లో పడిపోయిందని డేవ్ చెప్పాడు. కంపెనీ తనను క్రెడిట్ కార్డు బిల్లు కట్టమంటుందో లేక జాబ్‌కు రిజైన్ చేసి వెళ్లిపోమంటుందో తెలియట్లేదని అన్నాడు. మైక్ యూట్యూబ్ ఛానల్‌ను కొన్ని రోజులు నిలిపివేసే అవకాశం ఉందని కూడా డేవ్ తెలిపాడు.
ఈ వార్తలనూ చదవండి:
35 వేల అడుగుల ఎత్తులో.. బొజ్జ గణపయ్య దర్శనం!.. వీడియో వైరల్
62 గంటలు సముద్రంలోనే.. మృత్యుంజయుడు ఈ బాలుడు..