Share News

62 గంటలు సముద్రంలోనే.. మృత్యుంజయుడు ఈ బాలుడు..

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:58 PM

తన అన్న, మరో సోదరుడు (కజిన్) తో కలిసి సముద్రంలో సరదాగా షికారుకు వెళ్లాడు 15 ఏండ్ల అబ్బాయి. ప్రమాదవశాత్తు బోటు తలకిందులు కావడంతో అన్న, కజిన్ చనిపోయారు. ఆ అబ్బాయి మాత్రం బతికాడు. 62 గంటలపాటు ఆ అబ్బాయి పసిఫిక్ మహాసముద్రంలో ఒంటరిగా గడిపాడు. చివరకు రెస్క్యూ బ‌ృందాలు ఆ పిల్లవాడిని రక్షించాయి.

62 గంటలు సముద్రంలోనే.. మృత్యుంజయుడు ఈ బాలుడు..

ఇంటర్‌నెట్ డెస్క్: తన అన్న, మరో సోదరుడి (కజిన్) తో కలిసి సముద్రంలో సరదాగా షికారుకు వెళ్లాడు 15 ఏండ్ల అబ్బాయి. ప్రమాదవశాత్తు బోటు తలకిందులు కావడంతో అన్న, కజిన్ చనిపోయారు. ఆ అబ్బాయి మాత్రం బతికాడు. 62 గంటలపాటు ఆ అబ్బాయి పసిఫిక్ మహాసముద్రంలో ఒంటరిగా గడిపాడు. చివరకు రెస్క్యూ బ‌ృందాలు ఆ పిల్లవాడిని రక్షించాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అలస్కాకు చెందిన డెరెక్ పార్కర్ అఘ్నాంగా తన అన్న, మరో వ్యక్తి (కజిన్) తో కలిసి ఈనెల 5న అలస్కా తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో బోటులో షికారుకు వెళ్లారు. అనుకోకుండా వారి బోటు తలకిందులు కావడంతో డెరెక్ మినహా మిగతా ఇద్దరు చనిపోయారు. బతికి బయటపడిన డెరెక్.. బోటు పైభాగంలో కూర్చుని దాదాపు మూడు రోజులు గడ్డకట్టే నీటిలో వణుకుతూ గడిపాడు. అంతేకాకుండా కొన్ని గంటల వరకు తన అన్న, కజిన్‌ల మృతదేహాలను అలాగే పట్టుకున్నాడు. తన కళ్ల ముందే ఆ ఇద్దరు చనిపోతుండగా నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాడు. కోస్ట్ గార్డ్‌కు విషయం తెలియడంతో ఈనెల 7న రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బాలుడిని కాపాడి హెలికాప్టర్‌లో సమీపంలోని ఆసపత్రికి తరలించారు.


విషమంగా బాలుడి పరిస్థితి

ఏకధాటిగా 62 గంటల పాటు సముద్రంలో గడపడంతో డెరెక్ తీవ్ర డీహైడ్రేషన్‌కు గురయ్యాడని అధికారులు తెలిపారు. బెరింగ్‌ సముద్రంలో తూర్పున నాలుగు మైళ్ల దూరంలో బాలుడిని కనుగొన్నామని చెప్పారు. ‘మొదట్లో బోటు తలకిందులు కావడంతో అందులో ఉన్న ముగ్గురూ ఒకరికొకరు పట్టుకున్నారు. నీటి ఒత్తిడి కారణంగా డెరెక్ మినహా మిగతా ఇద్దరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. డెరెక్ మాత్రం ఎలాగోలా బోటు పైభాగంపైకి ఎక్కి తన ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే, ఫిషింగ్ లైన్‌ ఒకటి బోటు మోటారులో చిక్కుకుపోవడం వల్లే బోటు తలకిందులు అయి ఉండవచ్చని భావిస్తున్నాం. ఆ ఫిషింగ్ లైన్‌ను వారు తీయడానికి యత్నించినా వీలు కాలేదు. అప్పటికే వాతావరణం ప్రతికూలంగా మారింది. ఇంతలోనే బోటు తలకిందులైంది. తన అన్న, మరో కజిన్‌ల డెడ్ బాడీలను వీలైనంతసేపు డెరెక్ పట్టుకుని ఉన్నాడు. చివరకు బలమైన అలలకు వదిలిపెట్టాడు’ అని అధికారులు వివరించారు. డెరెక్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. అతను హైపర్‌థర్మియా (శరీరం సాధారణ ఉష్ణోగ్రత కన్నా అధికంగా వేడెక్కడం) కు గురయ్యాడని చెప్పారు.


Also Read:

భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. బిల్లుపై ఓటు వేయనున్న యూఎస్ హౌస్..!

మోదీని కలిసిన స్కూల్‌మేట్‌కు తిరిగొచ్చిన భూమి.. స్థలాన్ని వదులుకున్న బీజేపీ ఎమ్మెల్యే..

పాకిస్థాన్‌పై డబ్బుల వర్షం కురిపిస్తున్న గాడిదలు.. ఎలాగంటే?

Updated Date - Sep 16 , 2026 | 01:28 PM