భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. బిల్లుపై ఓటు వేయనున్న యూఎస్ హౌస్..!
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:51 PM
రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం టారిఫ్‌లు వేయడానికి ఉద్దేశించిన బిల్లుపై యూఎస్ హౌస్ ఓటు వేయనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే అలాంటి దేశాలపై వంద శాతం సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం దక్కుతుంది. టారిఫ్‌లు విధించే అవకాశం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది.
ఇంటర్‌నెట్ డెస్క్: రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం టారిఫ్‌లు వేయడానికి ఉద్దేశించిన బిల్లుపై యూఎస్ హౌస్ ఓటు వేయనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే అలాంటి దేశాలపై వంద శాతం సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం దక్కుతుంది. టారిఫ్‌లు విధించే అవకాశం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ‘లిండ్‌సే ఓ గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ గా వ్యవహరించే ఈ బిల్లను 86-11 ఓటుతో యూఎస్ సెనేట్ ఇదివరకే ఆమోదించింది. రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి వీలు కల్పించడంతో పాటు రష్యా, ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించేందుకూ ఈ బిల్లును రూపొందించారు.
భారత్‌పై ఈ బిల్లు ప్రభావం ఎంత?
ఈ బిల్లును యూఎస్ హౌస్ ఆమోదిస్తే భారతీయ సరుకులపై ఆటోమేటిక్‌గా 100 శాతం సుంకాలు పడవు. అయితే రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనే దేశాలపైనా అలాగే రష్యాపై ఉన్న ఆంక్షలను తప్పించే దేశాలపై వంద శాతం సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి అధికారం ఉంటుంది. అలాంటి పది దేశాల జాబితాను డెమోక్రటిక్ ప్రతినిధి స్టీని హోయర్ రూపొందించారు. ఇండియా, చైనా, యూఏఈ, తుర్కియే, అజర్‌బైజాన్, హంగేరి, సింగపూర్, కజకస్తాన్, కిర్గిస్తాన్, ద స్లోవాక్ రిపబ్లిక్ ఆ జాబితాలో ఉన్నాయి. కాగా.. హోయర్ అమెండ్‌మెంట్‌ను యూఎస్ హౌస్ రూల్స్ కమిటీ పూర్తిగా అడాప్ట్ చేయలేదు. ఈ సవరణకు వ్యతిరేకగా కమిటీ 3-7తో ఓటు వేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ను అలాంటి దేశాల జాబితాలో చేర్చినా.. ఈ టారిఫ్‌లను ఆమోదించినట్లుగానీ, విధించినట్లుగానీ భావించరాదు.
సెనేట్ ఆమోదించిన వెర్షన్‌లో ఏముంది?
సెనేట్ ఆమోదించిన బిల్లులో భారత్ లేదా హౌస్ సవరణలో పేర్కొన్న ఇతర దేశాల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే, రష్యా నుంచి అత్యధిక పరిమాణంలో చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకునే ఐదు దేశాలకు వర్తించేలా విస్తృత విధానాన్ని ఇందులో పొందుపరిచారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఇందులో రష్యా నాయకత్వం, ఆ దేశ ఇంధన ఆదాయాలు, అలాగే ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగించే నౌకలను లక్ష్యంగా చేసుకునే చర్యలు ఉన్నాయి. అలాగే ఇరాన్‌పై ఆంక్షలను పొడిగించే నిబంధనలు కూడా ఉన్నాయి.
సుంకాల అధికారాన్ని తొలగించేందుకు మరో సవరణ..
అమెరికా ప్రతినిధుల సభలో ఈ సుంకాల నిబంధనలపై వ్యతిరేకత కూడా వచ్చింది. అధ్యక్షుడికి ద్వితీయ సుంకాలు విధించే విస్తృత అధికారాన్ని కల్పించే సెక్షన్‌ను తొలగించాలంటూ ప్రతినిధి గ్రెగరీ మీక్స్‌తో పాటు పలువురు డెమోక్రటిక్ సభ్యులు సవరణను ప్రతిపాదించారు. అయితే, ఈ సవరణను హౌస్ రూల్స్ కమిటీ తిరస్కరించింది. దీనిపై ఓటింగ్‌లో 3-7 తేడాతో సవరణను సభలో చర్చకు తీసుకురావడానికి అనుమతించలేదు. అనంతరం, బిల్లును పరిశీలించేందుకు సంబంధించిన నిబంధనను 7-3 ఓట్లతో కమిటీ ఆమోదించింది.
Also Read:
నాలుగేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష..