Share News

నాలుగేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష..

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:45 PM

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి అస్సాం కోర్టు మరణశిక్ష విధించింది. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో 2023లో ఈ ఘటన జరిగింది.

నాలుగేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష..
Death sentence

ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి అస్సాం కోర్టు మరణశిక్ష విధించింది. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో 2023లో ఈ ఘటన జరిగింది. బిలాసిపారా అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాణా దత్తా తాజాగా నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. ధుబ్రి జిల్లాలోని చాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల బాలికపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది (Assam POCSO court).


చాక్లెట్ ఇస్తానని బాలికను నమ్మించి తీసుకెళ్లిన నిందితుడు నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అత్యాచారం తర్వాత ఆ బాలికను చంపేసి సాక్ష్యాలను చెరిపేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ఉత్పల్ రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా న్యాయస్థానం తుదితీర్పు వెలువరించింది. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి, బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం కింద పలు అభియోగాలు రుజువైనట్లు కోర్టు తీర్పులో పేర్కొంది (Dhubri murder case).


బాలికను హత్య చేసిన కేసులో నిందితుడికి మరణ శిక్ష విధించారు. బాలికపై తీవ్రమైన లైంగిక దాడికి సంబంధించి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.50,000 జరిమానా (POCSO Act).. సాక్ష్యాలను మాయం చేయడం, నేరస్థుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి నేరాలకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.4,000 జరిమానా విధించారు. కాగా, ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించినప్పటికీ, సంబంధిత హైకోర్టు తప్పనిసరిగా ధ్రువీకరించాలి.


ఇవి కూడా చదవండి..

అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ ప్యాకేజీ.. 40 వేల భారీ బాంబుల సరఫరా..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 16 , 2026 | 12:45 PM