మోదీని కలిసిన స్కూల్‌మేట్‌కు తిరిగొచ్చిన భూమి.. స్థలాన్ని వదులుకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:45 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఆయన చిన్ననాటి స్నేహితుడు అస్గర్ అలీ వోరా తన భూమిని తిరిగి దక్కించుకున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో ఆయనకు ఊరట లభించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఆయన చిన్ననాటి స్నేహితుడు అస్గర్ అలీ వోరా తన భూమిని తిరిగి దక్కించుకున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో ఆయనకు ఊరట లభించింది. మహారాష్ట్రలోని మీరా-భాయందర్‌లో వివాదాస్పదంగా మారిన భూమిపై తన ఆధిపత్యాన్ని వదులుకుంటున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా ప్రకటించారు. నిర్మాణ అనుమతిని కూడా వెనక్కి ఇస్తున్నట్లు తెలిపారు (PM Narendra Modi’s former schoolmate).బ
81 ఏళ్ల అస్గర్ అలీ వోరా గుజరాత్‌లోని వడ్నగర్‌లో నరేంద్ర మోదీతో కలిసి చదువుకున్నారు. భాయందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేశానని వోరా చెబుతున్నారు. 2011లో తనకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి భూమిని రెండు భాగాలుగా విభజించారని వోరా ఆరోపించారు. అందులో ఒక భాగం స్వయం బిల్డర్స్‌కు, మరో భాగం నరేంద్ర మెహతాతో సంబంధం ఉన్న సెవెన్ ఎలెవెన్ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించినదిగా చూపించారని ఆయన పేర్కొన్నారు (BJP MLA Narendra Mehta).
ఈ భూ వివాదంపై వోరా (Asgar Ali Vora) సెప్టెంబర్ 8న ప్రధాని మోదీని కలిశారు. భూమిపై తన హక్కును పునరుద్ధరించడంతో పాటు, పత్రాల అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. వోరా ప్రధాని మోదీని కలిసిన అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకర్ పరదేశీ అధ్యక్షతన మంత్రాలయంలో సమావేశం జరిగింది. వోరాతో పాటు నరేంద్ర మెహతా, మీరా-భాయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా వినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తం షిండే పాల్గొన్నారు. ఈ సమావేశంలో నరేంద్ర మెహతా వివాదాస్పద స్థలంపై తన ఆధిపత్యాన్ని వదులుకుంటున్నట్లు టౌన్ ప్లానింగ్ శాఖకు లేఖ ఇచ్చారు. ఆ స్థలానికి సంబంధించిన నిర్మాణ అనుమతిని కూడా తిరిగి అప్పగిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ ప్యాకేజీ.. 40 వేల భారీ బాంబుల సరఫరా..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..బ