బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా కూలిన న్యూస్ హెలికాప్టర్.. ముగ్గురి మృతి..
ABN , Publish Date - Sep 16 , 2026 | 10:50 AM
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదాన్ని గగనతలం నుంచి కవర్ చేస్తున్న ఓ న్యూస్ హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదాన్ని గగనతలం నుంచి కవర్ చేస్తున్న ఓ న్యూస్ హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. లాస్ ఏంజెల్స్‌లోని చాట్స్‌వర్త్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది (Los Angeles helicopter crash).
మంగళవారం సాయంత్రం చాట్స్‌వర్త్ ప్రాంతంలో ఓ ఎస్‌యూవీ, మెట్రో బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనను కవర్ చేసేందుకు పలు న్యూస్ హెలికాప్టర్లు గాల్లో తిరుగుతున్నాయి. ఆ సమయంలో ఎన్‌బీసీ4 న్యూస్‌కు చెందిన హెలికాప్టర్ ఒక్కసారిగా కిందకు దూసుకెళ్లి పార్కింగ్ ప్రాంతంలో కూలిపోయింది. హెలికాప్టర్‌లోని కెమెరాలో రికార్డైన వీడియోలో మొదట బస్ ప్రమాదం జరిగిన ప్రాంతం కనిపిస్తోంది. అనంతరం హెలికాప్టర్ ఒక్కసారిగా కిందకు దిగుతున్నట్లు, కెమెరా తీవ్రంగా కదులుతున్నట్లు కనిపించింది (US news helicopter crash).
హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్నది అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు (NBC4 helicopter crash). ప్రమాదంపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ ప్యాకేజీ.. 40 వేల భారీ బాంబుల సరఫరా..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..