సౌదీపై హౌతీల క్షిపణులు, డ్రోన్ల దాడులు.. మక్కాలో తొలిసారి వైమానిక హెచ్చరికలు..
ABN , Publish Date - Sep 16 , 2026 | 08:58 AM
ఇస్లాం పవిత్ర నగరం మక్కాలో తొలిసారిగా వైమానిక ముప్పు హెచ్చరికలు జారీ అయ్యాయి. సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇస్లాం పవిత్ర నగరం మక్కాలో తొలిసారిగా వైమానిక ముప్పు హెచ్చరికలు జారీ అయ్యాయి. సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మక్కా, జెడ్డా, తాయిఫ్ సహా పలు ప్రాంతాల్లో సౌదీ పౌర రక్షణ విభాగం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొద్దిసేపటికే మక్కాలో ప్రమాదం తొలగిపోయినట్లు అధికారులు ప్రకటించారు (Mecca air raid alert).
సెప్టెంబర్ 15న మక్కాకు దక్షిణంగా వచ్చిన ఓ హౌతీ డ్రోన్‌ను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుని ధ్వంసం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి ప్రవేశించే ముందే కూల్చివేసినట్లు సమాచారం. అయితే మక్కాను లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన వార్తలను హౌతీలు ఖండించారు. హౌతీ రాజకీయ విభాగానికి చెందిన హాజెమ్ అల్-అసద్ సౌదీ ఈ ఆరోపణలను తిరస్కరించారు (Mecca Houthi attack).
మక్కాలో హెచ్చరికలకు ముందు రోజు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలపై హౌతీలు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు (Houthi missiles Saudi Arabia). ఈ దాడుల్లో 13 మంది గాయపడ్డారని సౌదీ నేతృత్వంలోని కూటమి పేర్కొంది. ఈ వారం సౌదీపై హౌతీల దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. సౌదీ వైమానిక రక్షణ దళాలు మక్కాకు దక్షిణంగా ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన నగరమైన మక్కాలో వైమానిక ముప్పు హెచ్చరిక వెలువడటం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి..
అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ ప్యాకేజీ.. 40 వేల భారీ బాంబుల సరఫరా..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..