ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Sep 15 , 2026 | 09:55 AM
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పండుగలాంటి వార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పండుగలాంటి వార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 163 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ సహా వివిధ శాఖలలో 729 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే 5 విభాగాల్లో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనుండగా.. మరో 10 విభాగాల పోస్టులకు ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టుల అర్హతల వివరాలను తెలియజేసింది.
మొత్తం పోస్టులు :163
డిప్యూటీ కలెక్టర్లు: 11
ఏపీ టాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు: 14
డి.ఎస్.పి సివిల్: 36
డీఎస్పీ కమ్యూనికేషన్స్: 3
డీఈవోలు: 14
ఆర్టీవోలు: 3
జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్: 1
డిప్యూటీ రిజిస్టర్ కోపరేటివ్ సర్వీసెస్: 15
మునిసిపల్ కమిషనర్ గ్రేడ్ 2- 12
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్: 2
డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్: 3
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 14
డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్: 35
ఇవి కూడా చదవండి...
విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. నిందితుల కోసం పోలీసుల గాలింపు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి.. సీఎం చంద్రబాబు నివాళులు
Read Latest AP News And Telugu News