Share News

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి.. సీఎం చంద్రబాబు నివాళులు

ABN , Publish Date - Sep 15 , 2026 | 09:49 AM

ప్రముఖ సివిల్ ఇంజినీర్, భారతరత్న, డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి.. సీఎం చంద్రబాబు నివాళులు
CM Chandrababu

అమరావతి, సెప్టెంబర్ 15: ప్రముఖ సివిల్ ఇంజినీర్, భారతరత్న, డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఇంజినీరింగ్ రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తుచేశారు. ఇంజినీరింగ్ రంగంలో భారతరత్న, డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య శిఖర సమానులని కొనియాడారు. విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ అంజలి ఘటించారు. ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ఠను పెంచుతున్న ఇంజినీర్లు అందరికీ ‘ఇంజనీర్స్ డే’ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్న ఇంజినీర్లను అభినందిస్తూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.


ఇంజినీర్ల శ్రమకు సెల్యూట్: డిప్యూటీ సీఎం పవన్

pawan-kalyan-hyderabad.jpg

ఇంజినీర్స్ డే సందర్భంగా దేశంలోని ఇంజనీర్లందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు పవన్ ఘన నివాళి అర్పించారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య మేధస్సు, క్రమశిక్షణ, అంకితభావం మార్గదర్శకమని చెప్పుకొచ్చారు. ఇంజినీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు చేపట్టడమే కాదని.. సమస్యలకు పరిష్కారాలు చూపడమని అన్నారు. భారత్‌ను బలంగా మార్చడంలో ఇంజినీర్ల ఆలోచనలు, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. మౌలిక వసతులు, సాంకేతిక రంగాన్ని బలోపేతం చేస్తున్న ఇంజినీర్ల శ్రమకు సెల్యూట్ అంటూ ఎక్స్‌లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు

విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. నిందితుల కోసం పోలీసుల గాలింపు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 10:18 AM