Share News

విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. నిందితుల కోసం పోలీసుల గాలింపు

ABN , Publish Date - Sep 15 , 2026 | 09:21 AM

విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. నిందితుల కోసం పోలీసుల గాలింపు
Vijayawada Explosives Case

విజయవాడ, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 46 జిలిటన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట నుంచి విజయవాడకు యూపీకు చెందిన ఆసిఫ్ అలీ వచ్చాడు. అతను ప్రయాణించిన బస్సులో తన బ్యాగుకు బదులు వేరోకరీ బ్యాగ్ ఉందని అసిఫ్ అలీ ఓపెన్ చేశాడు. ఈ క్రమంలో బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా బాంబులు ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే బస్టాండ్ అవుట్ పోస్ట్ పోలీసులకు అసిఫ్ అలీ సమాచారం ఇచ్చాడు.


ఈ బస్సులో ప్రయాణం చేసిన వారి వివరాలతో పాటు, సీసీటీవీ కెమెరాలను కృష్ణలంక పోలీసులు పరిశీలిస్తున్నారు. 46 జిలిటన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు.?, దీనివెనుక ఉన్నది ఎవరనే విషయాలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. అనుమానిత వస్తువులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కృష్ణలంక పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 09:44 AM