తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 14 , 2026 | 08:19 AM
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శ్రీవారి సర్వ సేనాధిపతి విశ్వక్సేనులవారు పర్యవేక్షించనున్నారు.
తిరుమల, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈరోజు (సోమవారం) అంకురార్పణ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శ్రీవారి సర్వ సేనాధిపతి విశ్వక్సేనులవారు పర్యవేక్షించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. రేపు (మంగళవారం) సాయంత్రం 6:21 నుంచి 6:35 నిమిషాల వరకు మీన లగ్నంలో శ్రీవారి ఆలయంలో ధ్వజారోహాణం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.
రాత్రి 7.30 గంటలకు ఏపీ ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టువస్త్రాలను సీఎం చంద్రబాబు దంపతులు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఎల్లుండి ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రికల్ బస్సులు, నందనం యాప్, భక్తులకు ఎల్‌ఐసీ పథకం, ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘నేతన్న సేవ’ కింద ఒక్కో నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం: మంత్రి జనార్దన్ రెడ్డి
గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు: మంత్రి ఆనం
బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News